ఆంధ్రప్రదేశ్ లో సీబీఎస్ఈ అనుబంధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్ధులకు ఈ సంవత్సరం నుంచి రాష్ట్ర బోర్డు పరీక్షలు రాసేందుకు వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. అంతర్గత పరీక్షల ఫలితాల ఆధారంగా విద్యాశాఖ మంత్రి మంత్రి లోకేశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర బోర్డు పరీక్షలకు, సీబీఎస్ఈలకు తేడా ఉంటుంది. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ అనుబంధ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు ఇటీవల విద్యాశాఖ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో 64 శాతం మంది ఉత్తీర్ణులు కాలేదని తెలిపారు. అలాగే 326 పాఠశాలలో ఒక్క విద్యార్ధి కూడా పాస్ కాలేదు. 556 పాఠశాలల్లో 25 శాతం లోపే ఉత్తీర్ణత శాతం నమోదైంది. 66 పాఠశాలల్లో 26 నుంచి 50 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాలు చూస్తే విద్యార్ధులు సీబీఎస్ఈ విధానంలో పరీక్షలు రాస్తే ఉత్తీర్ణులు అయ్యే పరిస్థితి లేదని ఈ విషయాన్ని అధికారులు విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకురావడంతో ఈ ఏడాది సీబీఎస్ఈ విద్యార్థులకు రాష్ట్ర బోర్డు పరీక్షలకు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది నుంచి సీబీఎస్ఈ రాష్ట్ర బోర్డు పరీక్షలు రాసేందుకు వెసులుబాటు ?
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق