హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ పై నిమర్జం లేదని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. నిమర్జనం కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని, మండపం నిర్వాహకులు పోలీసులకు సహకరిస్తున్నారని వెల్లడించారు. హైదరాబాద్ సిటీ పరిధిలో 15 వేలు, ఇతర జిల్లాల నుంచి మరో 3 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారని వివరించారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు లో నిమర్జనం ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో మరో 8వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారని తెలిపారు. ఇదే సమయంలో ములాధుమ్ నబీ ప్రోగ్రామ్ ఉంది మత పెద్దలతో సమన్వయం చేస్తున్నామని వెల్లడించారు. 17న పబ్లిక్ గార్డెన్ లో ప్రజా పాలన దినోత్సవం కార్యక్రమం, పెరేడ్ గ్రౌండ్ లో మరో కార్యక్రమం ఉందన్నారు.
إرسال تعليق