కాళేశ్వరం నిర్మాణానికి రూ.93వేల కోట్లు ఖర్చయితే రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని భారాస నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన మల్లన్న సాగర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళేశ్వరం కొట్టుకుపోయిందని కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెట్టారని, కాళేశ్వరం కొట్టుకుపోతే మల్లన్నసాగర్‌లోకి నీళ్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కాళేశ్వరం జలాలతో మల్లన్నసాగర్ నిండు కుండలా ఉందన్నారు. భారాసది వాటర్ డైవర్ట్ పాలిటిక్స్ అయితే కాంగ్రెస్‌ది అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్ ఎద్దేవా చేశారు.
భారాసది వాటర్ డైవర్ట్ పాలిటిక్స్ అయితే కాంగ్రెస్‌ది అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్ !
الجمعة، 20 سبتمبر 2024
telangana భారాస నేత భారాసది వాటర్ డైవర్ట్ పాలిటిక్స్ అయితే కాంగ్రెస్‌ది అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్ మాజీ మంత్రి హరీశ్‌రావు రూ.93వేల కోట్లు ఖర్చయితే రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది
ليست هناك تعليقات:
إرسال تعليق