మోడీ ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులతో ప్రతిపక్షాలను భయపెడుతోంది. దేశంలోని ప్రతిపక్షపార్టీలకు చెందిన నేతలను మనీలాండరింగ్‌ కేసుల్లో ఇరికించి వారిని తీవ్ర కలిచివేతకు గురిచేస్తోంది. గత కొన్నేళ్లుగా ఆర్థిక నేరారోపణలు రుజువు కానప్పటికీ విచారణ పేరిట వారిని వేధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో ఇడి వ్యవహరిస్తున్న తీరును పారిస్‌కు చెందిన ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ సంస్థ విమర్శించింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మనీలాండరింగ్‌ టెర్రర్‌ ఫైనాన్సింగ్‌ను పరిశీలిస్తుంది. తాజాగా ఈ సంస్థ 2019 నుంచి 2023 వరకు ఐదేళ్లలో భారత్‌లోని ఇడి రూ. 16,497 కోట్ల మేర జప్తులను చేసిందని ఎఫ్‌ఎటిఎఫ్‌ గురువారం విడుదల చేసిన తాజా నివేదిక తెలిపింది. ఈ ఐదేళ్లలో నేరారోపణల ఆధారంగా జప్తు చేసిన వాటి విలువ రూ. 39 కోట్లు అని ఎఫ్‌ఎటిఎఫ్‌ నివేదిక తెలిపింది. ఈ ఐదేళ్లలో 4,163 ఇడి దర్యాప్తులను ప్రారంభించింది. వాటిల్లో 28 కేసులే దోషులుగా తేల్చింది. 132 కేసులు తదుపరి విచారణ చేయకూడదని ఇడి నిర్ణయించినట్లు ఈ నివేదిక పేర్కొంది. విచారణల సంఖ్య పెరుగుతోంది. కానీ.. ప్రాసిక్యూషన్‌ ఫిర్యాదుల సంఖ్య వేగంగా లేదని ఈ నివేదిక ఆరోపించింది. నేరారోపణల రేటును పెంచడానికి పెండింగ్‌లో ఉన్న ప్రాసిక్యూషన్‌లను త్వరితగతిన ముగించాలి. సకాలంలో విచారణను కొనసాగించాలి. దీనికి ఇడి, ప్రత్యేక కోర్టులకు వనరులను మెరుగుపరుచుకోవాలని ఎఫ్‌ఎటిఎఫ్‌ సంస్థ భారత్‌కు సూచించింది. అయితే ఎఫ్‌ఎటిఎఫ్‌ సంస్థ విమర్శలను మోడీ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. పైగా జి - 20 దేశాల్లో లండన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ వంటి దేశాల తర్వాత భారత్‌కే రేటింగ్‌ ఇచ్చినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖలో అదనపు కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌ గొప్పగా చెప్పారు.

Post a Comment

أحدث أقدم