పారాలింపిక్స్ లో శుక్రవారం రాత్రి ఇండియా ఖాతాలో మరో రెండు పతకాలు వచ్చి చేరాయి. లాంగ్ జంప్ పోటీల్లో భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ బంగారు పతకం సాధించగా, షాట్ పుట్ పోటీల్లో మాజీ ఆర్మీ ఆఫీసర్ హొకాటో హోటోజె సెమా కాంస్య పతకం సాధించారు. లాంగ్ జంప్ పోటీల్లో ప్రవీణ్ కుమార్ ఒక సూపర్ జంప్ చేశాడు. ఏషియన్ గేమ్స్ లో తను సాధించిన రికార్డ్ ని తనే బద్దలు కొట్టాడు. పారిస్ పారాలింపిక్స్ లో హై జంప్ పోటీల్లో ఆరుగురు అథ్లెట్లతో పోటీ పడుతూ 2.08 మీటర్ల బెస్ట్ జంప్ చేసి ప్రవీణ్ కుమార్ కొత్త రికార్డ్ ని సృష్టించాడు. పోడియంలో టాప్ పొజిషన్ ని కైవసం చేసుకున్నాడు. పుట్టుకతో ఒక కాలు చిన్నగా ఉన్న ప్రవీణ్ కుమార్ పారిస్ పారాలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. మరోవైపు భారత్ మాజీ ఆర్మీ ఆఫీసర్ హొకాటో హోటోజె సెమా షాట్ పుట్ త్రో పోటీల్లో 14.65 మీటర్ల్ బెస్ట్ త్రో చేశాడు. F57 క్లాస్ షాట్ పుట్ పోటీల్లో సెమా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు. ఈ రెండు పతకాలతో భారత్ సాధించిన మొత్తం మెడల్స్ సంఖ్య 27 కు చేరింది. పారాలింపిక్స్ పోటీల్లో తొలిసారి పోటీ చేసిన హొకాటో హోటోజె సెమా(40) .. భారత సైన్యంలో ఆర్మీ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తూ.. 2002లో ఒక టెర్రరిస్ట్ ఆపరేషన్ లో తన కాలుని కోల్పోవాల్సి వచ్చింది. అయిన ఆయన ధైర్యం కోల్పోలేదు. 32 ఏళ్ల వయసులో షాట్ పుట్ క్రీడను ఎంచుకొని ఏషియన్ పారా గేమ్స్ 2023లో 13.94 మీటర్ల త్రో చేసి కాంస్య పతకం సాధించాడు. 2023లో ప్రపంచ షాట్ పుట్ పోటీల్లో హొకాటో పాల్గొని ఏడో స్థానంలో నిలిచారు. ఇప్పుడు హొకాటో హోటోజె సెమా తన దేశం కోసం పారిస్ పారాలింపిక్స్ లో కాంస్య పతకం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
పారాలింపిక్స్ లో హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం !
السبت، 7 سبتمبر 2024
national sports పారాలింపిక్స్ లో హై జంప్ లో గోల్డ్ ప్రవీణ్ కుమార్ బంగారు పతకం షాట్ పుట్ పోటీల్లో హొకాటో హోటోజె సెమా కాంస్య పతకం షాట్ పుట్ లో కాంస్యం
ليست هناك تعليقات:
إرسال تعليق