తెలంగాణలోని కరీంనగర్ లో ఒక కుటుంబానికి టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ రూ. 5 కోట్ల క్లెయిమ్ చెల్లించింది. జ్యోతినగర్ నివాసి అయిన దివంగత అంతగిరి రాజు ఐదేళ్ల క్రితం టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్లో రూ. 5 కోట్ల కవరేజీతో టర్మ్ పాలసీ తీసుకున్నారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆయన కుటుంబానికి భారీ మొత్తంలో ఆర్థిక సాయం అందించే అవకాశం కలిగింది. గురువారం జరిగిన కార్యక్రమంలో, టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కరీంనగర్ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ రామకృష్ణారెడ్డి, మృతుని భార్య శశికళకు రూ. 5 కోట్ల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ బ్రాంచ్ మేనేజర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, 'ప్రతి కుటుంబ పెద్ద బాధ్యతగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని, తమ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించుకోవాలి. ప్రతి కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడమే టాటా ఏఐఏ ముఖ్య లక్ష్యం' అని అన్నారు. ఇన్సూరెన్స్ మరియు క్లెయిమ్ల విషయంలో అపోహలకు లోనుకాకుండా, నమ్మకమైన కంపెనీ నుండి మాత్రమే ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఆయన సూచించారు.కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ వీరస్వామి, ఆదర్శ్ కుమార్, సుమలత, చంద్రశేఖర్, ఆపరేషన్స్ మేనేజర్ మహేందర్, సీనియర్ పార్టనర్ నరేందర్ రావు, లీడర్లు శ్రీకాంత్, రాజు, సృజన్ తదితరులు పాల్గొన్నారు.ప్రతి కుటుంబానికి ధీమా కల్పించాలనేదే లక్ష్యం: ప్రతి కుటుంబానికి జీవిత బీమాతో ధీమా కల్పించాలని లక్ష్యంతో పని చేస్తున్నామని లీడర్ మల్లారపు పుష్ప తెలిపారు. అందుకు అనుగుణంగా అన్ని కంపెనీల కంటే తక్కువ ప్రీమియంతోనే కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చే పాలసీలు ఇస్తున్నట్లు తెలిపారు. ఏజెంట్ల నియామకంతో పాటు కొత్త పాలసీలు తీసుకునే వారికి తాము సహకరిస్తున్నామన్నారు.
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ నుండి రూ. 5 కోట్ల బీమా చెక్కు అందజేత !
الخميس، 5 سبتمبر 2024
business tata telangana కరీంనగర్ లో ఒక కుటుంబానికి టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ నుండి రూ. 5 కోట్ల బీమా చెక్కు అందజేత
ليست هناك تعليقات:
إرسال تعليق