చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణపతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.25 లక్షల చొప్పున ప్రోత్సాహకాలను ప్రకటించారు. భారతదేశం తరఫున తొలిసారి స్వర్ణపతకాలు సాధించిన క్రీడాకారులు అర్జున్, ద్రోణవల్లి హారిక జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని అభినందించిన సీఎం.. రూ.25 లక్షల చొప్పున నజరానా ప్రకటించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి తదితరులు చదరంగ విజేతలను అభినందించారు.
అర్జున్, ద్రోణవల్లి హారికకు రూ.25 లక్షల చొప్పున నజరానా ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
الجمعة، 27 سبتمبر 2024
sports telangana అర్జున్ చదరంగ విజేతలను అభినందించారు ద్రోణవల్లి హారికకు రూ.25 లక్షల చొప్పున నజరానా ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ليست هناك تعليقات:
إرسال تعليق