తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మణికొండ, అల్కాపూరి కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ లడ్డూ వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆకస్మికంగా మృతి చెందారు. అల్కాపూరి కాలనీకి చెందిన శ్యామ్ ప్రసాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. వినాయక చవితి సందర్భంగా అల్కాపూరి టౌన్ షిప్‌లో గణపతిని ప్రతిష్టించారు. తాజాగా గణేష్ ఉత్సవ కమిటీ లడ్డూ వేలంపాట నిర్వహించింది. ఈ వేలంపాటలో పాల్గొన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ 15 లక్షల వరకు వేలంపాట పాడి గణపతి లడ్డూను దక్కించుకున్నారు.లడ్డూను దక్కించుకున్న సందర్భంగా.. గణనాథుడి మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ స్నేహితులతో శ్యామ్ ప్రసాద్ ఎంజాయ్ చేశారు. కానీ.. ఆ ఆనందం గంటల్లోనే ఆవిరి అయ్యింది. శ్యామ్ ప్రసాద్ ఇంటికి వెళ్లగానే గుండె పోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో ఆయన కుటుంబం, అల్కాపూరి కాలనీ విషాదంలో మునిగిపోయింది. అతని బంధువులు, స్నేహితులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
0 Comments