బడ్జెట్‌ ధరలో శాంసంగ్‌ గెలాక్సీ ఎం05 మొబైల్‌ విడుదల !

Thursday, September 12, 2024

000mAh బ్యాటరీ 4జీబీ+ 64జీబీ వేరియంట్‌ ధర రూ.7 5 999 samsung smart phone బడ్జెట్‌ ధరలో శాంసంగ్‌ గెలాక్సీ ఎం05 మొబైల్‌ విడుదల

t f B! P L


దేశీయ మార్కెట్‌లో శాంసంగ్‌ బడ్జెట్‌ ధరలో శాంసంగ్‌ గెలాక్సీ ఎం05 మొబైల్‌ను లాంచ్‌ చేసింది.  రెండేళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్స్‌, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో దీన్ని ఆవిష్కరించింది. 5,000mAh బ్యాటరీ,ñ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో తీసుకొచ్చిన ఈ మొబైల్‌ ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేయండి. 4జీబీ+ 64జీబీ వేరియంట్‌ ధర రూ.7,999గా కంపెనీ నిర్ణయించింది. మింట్‌ గ్రీన్‌ రంగులో ఈ ఫోన్‌ లభిస్తుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌ ప్లాట్‌ఫామ్‌తోపాటు ఇతర రిటైల్‌ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు. మొబైల్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.74 అంగుళాల హెచ్‌డీ+ పీఎల్‌ఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తోంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత వన్‌ యూఐతో పనిచేస్తుంది. ఇందులో మీడియాటెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌ ఉపయోగించారు. డ్యూయల్‌ నానో సిమ్‌కు సపోర్ట్‌ చేసేలా దీన్ని రూపొందించారు. మైక్రోఎస్‌డీ కార్డ్‌ సాయంతో 1టీబీ వరకు స్టోరేజ్‌ పెంచుకొనే సదుపాయం ఉంది. వెనకవైపు 50ఎంపీ ప్రధాన కెమెరా, 2ఎంపీ కెమెరా అమర్చారు. సెల్ఫీ కోసం ముందువైపు 8ఎంపీ కెమెరా ఇచ్చారు. 4జీ, 3.5mm హెచ్‌ఫోన్‌ జాక్‌, యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ