ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో అప్కాబ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆప్కాబ్ వాట్సప్ బ్యాంకింగ్ సేవలు మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగు చేసే రైతుకు ప్రాధాన్యత ఇవ్వాలని, టీడీపీ హయాంలో నూతన సంస్కరణలతో రైతుల జీవితాల్లో మార్పు రావాలని సూచించారు. కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి కౌలు రైతుల రుణాలు ఇవ్వాలన్నారు. పెత్తందారులకు కాకుండా పేదరికంలో ఉన్న రైతులకు రుణాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. రేపటి నుంచే పరిస్థితి మారాలన్నారు. బ్యాంకులకు ధీటుగా సహకార సంఘాలను తీర్చి దిద్దాలన్నారు. వ్యవస్థలో లోపాలు సరిదిద్దాలని ఆదేశించారు. డిజిటైలేజేషన్‌తోనే అక్రమాలకు చెక్ చెప్పగలం. సహకార సంఘాల్లో అవినీతిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఆప్కాబ్ సేవలు విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆప్కాబ్ – డీసీసీబీ, సహకార సంఘాల ద్వారా మహిళా సంఘాలకు అధిక శాతం రుణాలను అందించాలని, సహకార వ్యవస్థలో EKYC అమలు చేసి పారదర్శకంగా సేవలు అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు మంత్రి అచ్చెన్నాయుడు.. ఈరోజు ఆప్కాబ్ వాట్సప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించాను. ఆప్కాబ్ సేవలు విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని.. ఆప్కాబ్, డీసీసీబీ, సహకార సంఘాల్లో జవాబుదారీతనం, పారదర్శకంగా సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని.. సహకార వ్యవస్థలో EKYC అమలు చేయడంతో పాటు ఈ – ఆఫీస్ విధానంలో కార్యకలాపాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
ఆప్కాబ్ వాట్సప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించిన అచ్చెన్నాయుడు !
السبت، 3 أغسطس 2024
Andhra Pradesh ఆప్కాబ్ వాట్సప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించిన అచ్చెన్నాయుడు చిట్ట చివరి కౌలు రైతుకు కూడా న్యాయం జరగాలని సాగు చేసే రైతుకు ప్రాధాన్యత ఇవ్వాలని
ليست هناك تعليقات:
إرسال تعليق