పారిస్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ నిరాశపర్చాడు. పతకం ఆశలను వమ్ము చేశాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో విభాగంలో సెమీఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్ విక్టర్ ఆక్సెల్సెన్ చేతిలో ఓటమితో ఫైనల్స్ ఆశలు చేజార్చుకున్న లక్ష్యసేన్ కాంస్య పతకం కోసం సోమవారం జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమి చెందాడు. తొలి సెట్‌ను తేలికగా గెలుచుకున్న లక్ష్యసేన్ రెండు, మూడు సెట్లను వరుసగా చేజార్చుకున్నాడు. గాయంతో ఇబ్బంది పడటంతో వరుస రెండు సెట్లలో ఓటమి చవిచూశాడు. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో మలేషియాకు చెందిన లీ జీ జియా లక్ష్యసేన్‌పై విజయం సాధించాడు. 14-21, 21-16, 21-11 తేడాతో వరుసగా రెండు సెట్లను గెలుచుకుని మలేషియా ఆటగాడే కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ విభాగంలో భారత్‌కు నిరాశ మిగిలింది. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ నెంబర్ 7 క్రీడాకారుడు లీ జీ జియా ప్రపంచ నెంబర్ 19 క్రీడాకారుడు లక్ష్యసేన్‌పై విజయం సాధించాడు. మొదటి సెట్‌లో అధిక్యాన్ని కనబర్చిన లక్ష్యసేన్.. రెండు, మూడు సెట్లలో వెనుకబడ్డాడు. దీంతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్ ఓటమి !
الاثنين، 5 أغسطس 2024
14-21 21-11 తేడాతో 21-16 national olympics 2024 బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్ ఓటమి మలేషియాకు చెందిన లీ జీ జియా లక్ష్యసేన్‌పై విజయం
ليست هناك تعليقات:
إرسال تعليق