ఉత్తర ప్రదేశ్ లోని షాజహాన్ పూర్, హతౌడా గ్రామంలో సత్యపాల్ (40), గాయత్రి దేవీలు (39) ఉండేవారు. వీరికి 20 ఏళ్ల క్రితం పెళ్లైయింది. ఇద్దరు సంతానం. కూతురు బీఏ చదువుతుండగా, కొడుకు ఇంటర్ చదువుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు భర్త నాన్ వెజ్ వండిపెట్టాలని , భార్యను శారీరకంగా వేధించేవాడు. తాగి వచ్చి రోజు గొడవలకు దిగేవాడు. గాయత్రి మాత్రం పూర్తిగా శాఖాహారీ. ఆమె నాన్ వెజ్ వండటానికి ఎక్కువగా ఇష్టపడేది కాదు. కానీ భర్త మాత్రం విన్పించుకునే వాడు కాదు. ఈ క్రమంలో గురువారం కూడా రాత్రి బాగా మద్యం తాగి వచ్చి నాన్ వెజ్ వండాలని గొడవకు దిగాడు. దీంతో భార్య ఎదురుతిరిగింది. అంతేకాకుండా భర్తపై ఇటుకతో దాడికి దిగింది. అతను భయంతో పారిపోతుండగా అతని మీద కూర్చుని ఇటుకతో తలను పగుల కొట్టింది. అతను చనిపోయిన కూడా అతని బుర్ర బద్దలు కొట్టి మాంసం, రక్తంను బైటకు తీసి శాడిస్ట్ గా ప్రవర్తించింది. అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చిన కూడా మహిళ అతని తలనుంచి రక్తంను బైటకు తీస్తు కూర్చుంది. దీంతో పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళ మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించినట్లు కూడా స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భర్త తలపగలగొట్టి రక్తం బైటకు తీసిన భార్య ?
الجمعة، 9 أغسطس 2024
Criem Uttar Pradesh భర్త తలపగలగొట్టి రక్తం బైటకు తీసిన భార్య ? మహిళ మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది సోషల్ మీడియాలో వైరల్
ليست هناك تعليقات:
إرسال تعليق