తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖ రాశారు. సిద్దిపేట జిల్లాలో ప్రాజెక్టులు నీళ్లు లేక అడుగంటిపోతున్నాయని అందులో పేర్కొన్నారు. అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌లో నీళ్లు లేక అడుగంటిపోయే పరిస్థితికి వచ్చాయన్నారు. గతేడాది ఆగస్టులో ఆయా జలాశయాల్లో నీటి నిల్వ ఉందని చెప్పారు. కానీ ప్రస్తుతం వీటిలో చాలా తక్కువ నీరు ఉందని తెలిపారు. వర్షాలు రాక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పంటలు వేయాలా? వద్దా? అనే సందిగ్ధం వారిలో నెలకొందని వివరించారు. మధ్య మానేరు నుంచి నీటిని పంపింగ్ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని హరీశ్‌రావు కోరారు.
0 Comments