ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో వారు ప్రధానంగా ఇటీవలే బడ్జెట్ లో ఏపీలో వెనుబడినటువంటి జిల్లాలకు కేటాయించిన నిధులపై చర్చించారు. అమరావతి నిర్మాణానికి ప్రత్యేక సాయం రూ.15వేల కోట్లపై చర్చలు జరిపారు. గత ప్రభుత్వం వైసీపీ హయాంలో రుణాల పునర్వవస్థీకరణ అంశంపై మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికై ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం.
0 Comments