పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్‌ కాంస్య పతకాన్ని సాధించడం ఆనందాన్ని కలిగించిందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అమన్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. రెజ్లింగ్ విభాగంలో మన క్రీడాకారుల ప్రతిభ ప్రశంసనీయమన్నారు. వినేశ్ ఫొగాట్ దురదృష్టవశాత్తూ ఫైనల్ పోటీకి దూరమయ్యారని చెప్పారు. అమన్ పతకం సాధించడంతో క్రీడాభిమానులు సంతోషంగా ఉన్నారని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

Post a Comment

أحدث أقدم