69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ -2024 వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. పలువురు నటీమణులు తమ ప్రదర్శనలతో ఉర్రూతలూగించారు. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, వింద్య విశాఖ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ ఉత్సవంలో రాశీఖన్నా, అపర్ణ బాలమురళీ, సానియా ఇయాపాన్, గాయత్రీ భరద్వాజ్ తదితరుల ప్రదర్శన ఆహూతులను అలరించింది. నామినేషన్స్ జాబితాలో ఉన్న వారిలో విజేతలను ప్రకటిస్తున్న సమయంలో వేడుక మొత్తం విజిల్స్ చప్పట్లతో మార్మోగిపోయింది. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న 'బలగం' ఉత్తమ చిత్రంగా నిలవడంతో పాటు, ఉత్తమ దర్శకుడిగా వేణు అవార్డు అందుకున్నారు. 'దసరా'లో నటనకు గానూ నాని , కీర్తి సురేష్‌లు ఉత్తమ నటీనటులుగా ఎంపికయ్యారు. ఉత్తమ పరిచయ దర్శకుడి అవార్డును ఇద్దరు అందుకున్నారు. శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యువ్ (హాయ్ నాన్న) ఇద్దరి సినిమాల్లోనూ నాని కథానాయకుడిగా నటించడం మరో విశేషం. 'బేబీ' చిత్రానికి కూడా వివిధ విభాగాల్లో అవార్డులు లభించాయి.
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రం బలగం, ఉత్తమ నటుడు నాని
Sunday, August 4, 2024
69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ -2024 cinema south india ఉత్తమ నటుడు నాని కన్నడ తమిళ తెలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రం బలగం మలయాళ
No comments:
Post a Comment