ఉత్తర ప్రదేశ్‌లో కొత్తగా పెళ్లయిన మహిళపై ఇంట్లోనే అత్యాచారం జరిగింది. భాదోహిలో 20 ఏళ్ల మహిళపై రాహుల్ (28)అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం సాయంత్రం మహిళ భర్త ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన జరిగింది. రాహుల్ ముందుగా సదరు మహిళతో అక్రమ సంబంధం పెట్టుకునేందుకు ప్రయత్నించాడని, ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో డబ్బులు కూడా ఎరగా చూపాడని, ఆమె ప్రతిఘటించడంతో నోరు మూసి అత్యాచారానికి పాల్పడ్డాడని ఇన్‌స్పెక్టర్ సచ్చిదానంద్ పాండే తెలిపారు. భర్త తిరిగి వచ్చిన తర్వాత తనకు జరిగిన అన్యాయాన్ని అతడికి వివరించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 64[1] (రేప్), 351[2] (నేరపూరిత బెదిరింపు) కింద నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. కేసును విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కొత్తగా పెళ్లయిన మహిళపై అత్యాచారం !
السبت، 31 أغسطس 2024
351[2] (నేరపూరిత బెదిరింపు) కింద నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు 64[1] (రేప్) Criem Uttar Pradesh కొత్తగా పెళ్లయిన మహిళపై అత్యాచారం భర్త ఇంట్లో లేని సమయంలో
ليست هناك تعليقات:
إرسال تعليق