విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బొత్స సత్యనారాయణ ఖరారు అయ్యారు. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసిన బొత్స సత్యనారాయణ టీడీపీ నేత మాజీమంత్రి కళా వెంకట్రావ్ చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నిక ముగిసి రెండు నెలలు కూడా గడవకముందే మళ్ళీ ప్రత్యక్ష ఎన్నికల్లో బొత్స తలపడుతున్నారు. స్థానిక సంస్థల్లో వైసీపీకి సంపూర్ణబలం ఉండటంతో బొత్సను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా పలువురు నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. కూటమి తరపున ఇంకా అభ్యర్ధి ఖరారు కాకపోయినా విజయంపై ధీమాగా ఉంది. వైసీపీకి మరోసారి ఓటమి రుచి చూపించాలని కూటమి నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికకు ఈ నెల 6న నోటిఫికేషన్ విడుదల కానుంది. 13 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. 16 వరకు ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. ఆగస్టు 30న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నిక జరగనుంది. సెప్టెంబర్ 3న కౌంటింగ్ చేపట్టనున్నారు.
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బొత్స !
الجمعة، 2 أغسطس 2024
Andhra Pradesh వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బొత్స వైసీపీకి మరోసారి ఓటమి రుచి చూపించాలని కూటమి నేతలు ప్రణాళికలు వైసీపీకి సంపూర్ణబలం ఉండటంతో బొత్సను రంగంలోకి దింపుతున్నారు
ليست هناك تعليقات:
إرسال تعليق