అసెంబ్లీ కౌరవ సభను తలపిస్తోంది : హరీష్ రావు


సెంబ్లీ కౌరవ సభను తలపిస్తోందని, ఏది ఏమైనా అంతిమ విజయం పాండువులదేనని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూఏదైనా ఒక ముఖ్యమైన అంశంపై ప్రధాన ప్రతిపక్షం నుంచి ఎవరు మాట్లాడుతారని అడిగి అవకాశం ఇచ్చే సాంప్రదాయం సభలో ఉందని గుర్తు చేశారు. అలా కాకుండా సభ ఓ కౌరవ సభను తలపిస్తోందని కామెంట్ చేశారు. సభా, సాంప్రదాయాలను అధికారం పక్షం తుంగలో తొక్కినందుకు తాను నిరసన వ్యక్తం చేస్తున్నానని అన్నారు. అసెంబ్లీలో జరుగుతున్న అన్ని విషయాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, సమయం వచ్చిన నాడు వారే కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెబుతారని హరీష్ రావు అన్నారు. 

Post a Comment

0 Comments