ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కూడా చాలామంది తాగడం మాత్రం మానుకోరు. ఈ మధ్యకాలంలో అయితే చిన్న పిల్లలు కూడా ధూమపానానికి పూర్తిగా అలవాటు పడిపోయారు. కనీసం 15 ఏళ్లు కూడా పూర్తిగా నిండకముందే పిల్లలు కూడా సిగరెట్లు తాగడం అలవాటు చేసుకున్నారు. అయితే స్మోకింగ్ చేయడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. స్మోకింగ్ కారణంగా కంటి ఆరోగ్యంపైనా ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. స్మోకింగ్, దృష్టి లోపానికి మధ్య ఉన్న సంబంధం ఆందోళన కలిగించే విషయం అని అంటున్నారు. మన ఆరోగ్య శ్రేయస్సు కోసం ధూమపానానికి మొత్తం దూరంగా ఉండటం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. కేవలం స్మోకింగ్ చేసే వారికి మాత్రమే కాకుండా ఆ పొగ పీల్చే వారికి కూడా కళ్ళపై హానికరమైన ప్రభావాలు పడతాయట. అందుకే ఎవరైనా స్మోకింగ్ చేస్తున్నప్పుడు పక్కన ఉండకపోవడమే మంచిది అని చెబుతున్నారు. తరచూ స్మోకింగ్ చేయడం వల్ల అది దృష్టి సమస్యల ప్రమాదాన్ని మరింత పెంచుతుందట. స్మోకింగ్ చేసేవారిలో వయస్సు సంబంధిత మచ్చల క్షీణత ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. స్మోకింగ్ వల్ల కంటి శుక్లాలు వచ్చే ప్రమాదాన్ని పెరుగుతుందట. ఈ సమస్య ఉంటే కంటి గుడ్డులో మబ్బుగా కన్పించడం, అస్పష్టమైన దృష్టి , ఒక వస్తువు రెండుగా కన్పించడం, కంటిలో తెల్లగా కన్పించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. స్మోకింగ్ చేయనివారితో పోలిస్తే స్మోకింగ్ చేసేవారిలో కంటిశుక్లాలు వచ్చే అవకాశం రెండు నుంచి మూడ రెట్లు ఎక్కువగా ఉంటుందట. కంటిశుక్లం కాకుండా కాంట్రాస్ట్ సెన్సిటివిటీని కూడా తగ్గిస్తుందట. రాత్రిపూట చూపు సరిగ్గా ఉండదట. స్మోకింగ్‌కు దూరంగా ఉంటే కంటిశుక్లం వచ్చే ముప్పును తగ్గించవచ్చని చెబుతున్నారు. కాబట్టి ఇకమీదటనైనా స్మోకింగ్ అలవాటుని మానుకోవడం మంచిది. మరి ముఖ్యంగా స్మోకింగ్ అలవాటు లేని వారు పక్కన ఎవరైనా స్మోక్ చేస్తుంటే పక్కకు వెళ్లిపోవడం వీలైనంత దూరంగా ఉండటం మంచిది. స్మోకింగ్ పీల్చడం అన్నది తాగడంతో సమానమే అని వైద్యులు అంటున్నారు.
0 Comments