ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య వరలక్ష్మీ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచినట్లు బంధువులు తెలిపారు. ఇదిలా ఉంటే వరలక్ష్మీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమర్తె. ఆమెను శ్యామ్ ప్రసాద్ రెడ్డి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నిర్మాతగా అవతరించిన ఆయన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. జబర్దస్త్ కామెడీ షో తో టెలివిజన్ ప్రోగ్రాం లో కొత్త ప్రయోగంతో సక్సెస్ అయ్యారు. దీనిలో వరలక్ష్మీ పాత్ర కూడా ఉన్నట్లు పలువురు చెబుతున్నారు. ఆమె మరణ వార్త విన్న ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య వరలక్ష్మీ కన్నుమూత
Thursday, August 8, 2024
Andhra Pradesh bullitera cinema telangana మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమర్తె శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య వరలక్ష్మీ కన్నుమూత
No comments:
Post a Comment