తెలంగాణలోని హుస్నాబాద్ మండలంలోని జిల్లల్ల గడ్డలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పాఠశాలలో ఉన్న సమస్యలపై ఆరా తీశారు. రెగ్యులర్ గా క్లాస్లు జరుగుతున్నాయా ఉదయం టిఫిన్, ఆహారం ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంట గదికి వెళ్లి పరిసరాలు పరిశీలించారు. అప్పుడే వండిన ఆహారాన్ని కురాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలనీ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ప్రతి రోజూ పెడుతున్న టిఫిన్, కూరల గురించి ఆరా తీశారు. అనంతరం విద్యార్థులు ఎంత మంది ఉన్నారు.. స్టాఫ్ ఎంత మంది..? విద్యార్థులకు సరిపడ ఉపాధ్యాయులు ఉన్నారా అని ప్రిన్సిపల్ నీ అడిగి తెలుసుకున్నారు. ఇటీవల జిల్లల గడ్డ సాంఘిక సంక్షేమ పాఠశాల నుండి జాతీయ స్థాయిలో హ్యాండ్ బాల్, త్రో బాల్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించి సత్కరించారు. స్కూల్ లో డోర్స్,విండోస్ సరిగా లేవని ,స్కూల్ పక్కనే కొండ ఉండడం వల్ల కొంత ఇబ్బందులు ఉన్నాయని దృష్టికి తీసుకొచ్చారు.. వెంటనే పాఠశాల పరిసరాలు బాగు చేస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలకు ఆర్వో ప్లాంట్ మంజూరు చేస్తామని, డైనింగ్ హాల్ లో బెంచేస్, టేబుల్స్, పిల్లలకు బెడ్స్ మంజూరు చేస్తామని తెలిపారు. విద్యార్థులంతా చదువులోనూ ఆటల్లోనూ మంచి ప్రతిభ కనబర్చాలని సూచించారు.
గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ !
الأربعاء، 7 أغسطس 2024
telangana ఆహారం ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఉదయం టిఫిన్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ వంట గదికి వెళ్లి పరిసరాలు పరిశీలించారు
ليست هناك تعليقات:
إرسال تعليق