క్విక్ కామర్స్ విభాగంలో అడుగపెట్టి అర్ధంతరంగా వైదొలగిన ఓలా తాజాగా మరోసారి రీఎంట్రీ ఇచ్చేందుకు సమాయత్తం అవుతోంది. ఇందుకోసం సొంతంగా డార్క్ స్టోర్లను (చిన్నపాటి గోదాములు) ఏర్పాటు చేయాలని ఓలా మాతృ సంస్థ ఏఎన్‌ఐ టెక్నాలజీస్ భావిస్తున్నట్లు సమాచారం. వినియోగదారుల నుంచి ఆర్డర్ రాగానే ఆయా డార్క్‌స్టోర్స్ నుంచి ఇంటికి నేరుగా డెలివరీ చేస్తారు. ఆర్డర్ తీసుకోవడం దగ్గర నుంచి డెలివరీ చేయడం వరకు అన్ని క్షణాల్లో జరిగిపోతాయి. ప్రస్తుతం 10 నిమిషాల డెలివరీ పేరిట పాపులర్ అయిన ఈ సేవలను అనేక సంస్థలు అందిస్తున్నాయి. ఆగస్టు 15న ఆ కంపెనీ నిర్వహించే వార్షిక సమావేశంలో దీనిపై ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది.గతంలో ఓలా డ్యాష్ పేరిట ఇ-కామర్స్ సేవలను అందించింది. 2022లో ఆ వ్యాపారాన్ని మూసివేసింది. దీంతోపాటు ఓలా సొంతంగా యూపీఐ సేవలను కూడా ప్రారంభించాలనుకుంటోందని సమాచారం.
క్విక్ కామర్స్ వ్యాపారంలోకి మళ్లీ ఓలా ?
الخميس، 8 أغسطس 2024
business national science technology ఓలా మాతృ సంస్థ ఏఎన్‌ఐ టెక్నాలజీస్ క్విక్ కామర్స్ వ్యాపారంలోకి మళ్లీ ఓలా ? సొంతంగా డార్క్ స్టోర్లను ఏర్పాటు చేయాలని
ليست هناك تعليقات:
إرسال تعليق