ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈమేరకు వేడుకల నిర్వహణ కోసం పంచాయతీలకు నిధులు పెంచినట్లు తెలిపారు. మైనర్ పంచాయతీలకు రూ.100 నుంచి రూ.10 వేలు, మేజర్ పంచాయతీలకు రూ.250 నుంచి రూ.25 వేలకు పెంచినట్లు తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకూ ఇదే విధంగా నిధులు ఇస్తామన్నారు. ''ఆగస్టు 15న పాఠశాలల్లో డిబేట్, క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించాలి. విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వాలి. ఆగస్టు 15న పాఠశాలల్లో స్వాతంత్ర్య సమరయోధులను, రక్షణ రంగంలో పని చేసిన వారిని, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించాలి. పిల్లలందరికీ చాక్లెట్లు, బిస్కెట్లు ఇవ్వాలి'' అని పవన్ సూచించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పంచాయతీలకు నిధుల పెంపు !
الجمعة، 9 أغسطس 2024
Andhra Pradesh డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మేజర్ పంచాయతీలకు రూ.250 నుంచి రూ.25 వేలకు మైనర్ పంచాయతీలకు రూ.100 నుంచి రూ.10 వేలు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పంచాయతీలకు నిధుల పెంపు
ليست هناك تعليقات:
إرسال تعليق