ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు గత వైభవాన్ని కొనసాగిస్తూ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. విశ్వ క్రీడల్లో వరుసగా రెండోసారి సెమీస్‌కు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జట్టుబ్రిటన్‌పై అద్భుతం చేసింది. షూటౌట్‌లో 4-2తో బ్రిటన్‌పై జయభేరి మోగించింది. విశ్వ క్రీడల్లో జోరుమీదున్న భారత జట్టు గోల్డ్ మెడల్ వేటలో మరో అడుగు వేసింది. ప్రీ క్వార్టర్స్‌లో బలమైన ఆస్ట్రేలియాను 3-2తో ఓడించి 52 ఏండ్ల రికా ర్డు బ్రేక్ చేసిన భారత జట్టు బ్రిటన్‌పైనా పంజా విసిరింది. షూటౌట్‌లో తొలుత బ్రిటన్ ఆటగాళ్లు అల్బెరి జేమ్స్, వాల్లసె జాచ్‌లు గోల్ కొట్టగా.. విలియమ్సన్ కొనర్, రోపర్ ఫిలిప్‌లు బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపలేకపోయారు.
ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్లో భారత్ పురుషుల హాకీ జట్టు
الأحد، 4 أغسطس 2024
national olympics 2024 sports ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్లో భారత్ పురుషుల హాకీ జట్టు విశ్వ క్రీడల్లో వరుసగా రెండోసారి సెమీస్‌కు షూటౌట్‌లో 4-2తో బ్రిటన్‌పై జయభేరి
ليست هناك تعليقات:
إرسال تعليق