తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరో జత యూనిఫాంలు సిద్దం చేసి పంపిణీ చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై ఆమె రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ స్వచ్చదనం, పచ్చదనం సక్సెస్ చేసిన అందరికికీ అభినందనలు తెలిపారు. జిల్లా స్థాయి అధికారుల నుంచి పారిశుధ్య కార్మికుల వరకు బాగా కష్టపడ్డారని అన్నారు. మంచి పనితీరు కనబరిచిన సిబ్బందిని ఆగస్టు 15న సన్మానిస్తామని అన్నారు. గతంతో పోలిస్తే ఎక్కువ పని జరిగిందని, కాని మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇక నుంచి ప్రతి నెలా మూడు రోజుల పాటు స్వచ్చదనం - పచ్చదనం డ్రైవ్ కొనసాగుతుందని అన్నారు. పాములతో ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని అన్నారు. క్లీనింగ్ మీద దఅష్టి సారించండి, పారిశుద్య లోపాలపై వార్తలు వస్తే సరిదిద్దండని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల వరకు అధికారులు ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని, జీపీ స్పెషల్ అధికారులు ఉదయం కనీసం మూడు గంటల పాటు గ్రామాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మహిళా సంఘాల సభ్యత్వాన్ని కోటి మందికి చేర్చాలి. మహిళా శక్తి ప్రోగ్రాంలో ఎస్సీ, ఎస్టీ మహిళల భాగస్వామ్యం పెంచాలని తెలిపారు.
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరో జత యూనిఫాం !
الثلاثاء، 13 أغسطس 2024
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై రివ్యూ తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరో జత యూనిఫాం పచ్చదనం సక్సెస్ చేసిన అందరికీ అభినందనలు మంత్రి సీతక్క అధికారులకు ఆదేశం స్వచ్చదనం
ليست هناك تعليقات:
إرسال تعليق