వైసీపీ రాజ్యసభ ఎంపీలైన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఆ పార్టీకి గుడ్‌బై చెబుతూ, తమ రాజీనామా పత్రాలను రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్ ధన్‌ఖడ్‌కు ఇచ్చారు. రాజీనామాలను ఉద్దేశించి వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు xలో ఓ ట్వీట్ పెట్టారు. "అధికారం లేదని పార్టీ మారినోళ్ళు, పరువు పోగొట్టుకున్నారు కానీ, ప్రజాదరణ పొందలేదు. ఇది చారిత్రిక సత్యం" అని ట్వీట్ చేశారు. ఇది ఎవర్ని ఉద్దేశించి చేశారో అందరికీ తెలుసు. రాజీనామా చేసిన వారినే పార్టీలో చేర్చుకోవాలని టీడీపీ నిర్ణయించింది. దీని వెనక కూటమిలో ఇతర పార్టీల షరతులు కూడా ఉన్నట్లు తెలిసింది. అందుకే టీడీపీ గతంలో తరహాలో కాకుండా రాజీనామా చెయ్యాలనే కండీషన్ పెట్టింది. అందుకే మోపిదేవి, బీద రాజీనామా పత్రాలు సమర్పించారని ప్రచారం జరుగుతుంది. 


Post a Comment

أحدث أقدم