నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోలేదా? నేను చేసుకుంటే తప్పా? : దివ్వెల మాధురి


ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కాంగ్రెస్ టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఇంకా తెరపడలేదు. శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి మీడియా ముందుకొచ్చి తన భర్త దివ్వెల మాధురి అనే పార్టీ నేతతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ షాకింగ్ ఆరోపణలు చేసింది. ఆ తర్వాత దివ్వెల మాధురి కూడా మీడియా ముందుకొచ్చి తన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించింది. ఈ గ్యాప్‌లో మాధురి కారు యాక్సిడెంట్‌కి గురవ్వడం, అది యాక్సిడెంట్ కాదు తానే ఆత్మహత్య చేసుకునేందుకు కారులో బయలుదేరానని చెప్పడం వివాదాస్పదంగా మారింది. దివ్వెల మాధురి తనకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్తూనే దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ఉంటున్నానని అంటున్నారు. ఇదెక్కడి న్యాయం అని మీడియా ప్రశ్నిస్తే, ఆమె సినీ నటుడు నాగ చైతన్య వైవాహిక జీవితాన్ని ఉదాహరణగా చెప్పి తన రిలేషన్‌షిప్‌ని కంపేర్ చేయడం వైరల్‌గా మారింది. “నేను దువ్వాడ శ్రీనుగారితో కలిసి ఉంటే తప్పేంటి ? స్నేహితులు కలిసి ఉండకూడదా? ఈరోజుల్లో పెళ్లైన వారంతా కలిసే ఉంటున్నారా ? నాగ చైతన్య, సమంతలు పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడిపోలేదా ? ఆ తర్వాత మళ్లీ నాగచైతన్య శోభితను నిశ్చితార్థం చేసుకోలేదా ? “ అని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

Post a Comment

0 Comments