రియల్ మీ 13 4జీ పేరిట ఆగస్టు 7న ఇండోనేషియాలో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది. ఆగస్టు ఎనిమిదో తేదీన ఫ్లాష్ సేల్ ప్రారంభం అవుతుంది. రియల్ మీ 13 4జీ రిలీజ్ టీజర్లో పలు ఆసక్తికర విషయాలను కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 685 ఎస్ఓసీ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది.120 హెర్జ్ అమోల్డ్ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఈ ఫోన్ 67 వాట్ల వరకూ చార్జ్ అవుతుంది. ఈ ఫోన్ పయోనీర్ గ్రీన్, స్కై లైన్ బ్లూ కలర్ ఆప్షన్ లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్లో 8జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ ఉంటుంది. సోనీ లిషియా ఎల్‌వైటీ 600 సెన్సార్ తో కూడిన పోర్ట్ రైట్ కెమెరాను లిగి ఉంటుంది. రియల్ మీ 13 4జీ ఫోన్లో చిప్‌సెట్, కెమెరా, ర్యామ్ సైజ్, స్క్రీన్ రకం, రిఫ్రెష్ రేట్, బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ అన్నీ గత జూన్‌లో ప్రకటించిన రియల్ మీ 12 4జీ లో మనం చూసిన వాటికి సమానంగా ఉన్నాయి.
ఆగస్టు 7న రియల్ మీ 13 4జీ స్మార్ట్ ఫోన్ విడుదల
الثلاثاء، 6 أغسطس 2024
120 హెర్జ్ అమోల్డ్ టచ్ స్క్రీన్ science smart phone technology ఆగస్టు 7న రియల్ మీ 13 4జీ స్మార్ట్ ఫోన్ విడుదల పయోనీర్ గ్రీన్ స్కై లైన్ బ్లూ కలర్ ఆప్షన్
ليست هناك تعليقات:
إرسال تعليق