దేశంలో వస్తు, సేవల పన్ను వసూళ్లు మరోసారి గణనీయంగా నమోదయ్యాయి. జులై నెలకు రూ.1.82 లక్షల కోట్లు వసూళ్లు జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో రూ.1.74 లక్షల కోట్లు వసూళ్లు నమోదయ్యాయి. అప్పటితో పోలిస్తే వసూళ్లు 10 శాతం మేర పెరగడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు (ఏప్రిల్- జులై) మధ్య రూ.6.56 లక్షల కోట్లు వసూళ్లు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.2.10 లక్షల కోట్లు నమోదు కావడం గమనార్హం. మరోవైపు జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం 5, 12, 18, 28 శాతం చొప్పున నాలుగు రకాల రేట్లు అమల్లో ఉండగా దాన్ని మూడుకు కుదించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటుచేసింది.
0 Comments