తెలంగాణలో గత ప్రభుత్వం నిర్వహించిన వివిధ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. పేవర్ లీకేజ్ కారణంగా వాటిని రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. పేపర్ లీకేజ్ కారణంగా 2023లో నిర్వహించిన చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టుల పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ, సిట్ నివేదికల ఆధారంగా 2023 జనవరి 3,8వ తేదీల్లో నిర్వహించిన పరీక్షలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను ప్రకటిస్తామని ప్రభుత్వం ఓ నోట్ విడుదల చేసింది.
0 Comments