Ad Code

విప్రోలో 12 వేల మందికి ఉద్యోగ అవకాశాలు !


ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 10 వేల నుంచి 12 వేల మంది ఉద్యోగులను నియమించుకుంటామని ఐటీ మేజర్ విప్రో ప్రకటించింది. ఇప్పటి వరకూ సంస్థలో ఉన్న ఖాళీలను ఈ ఏడాది భర్తీ చేస్తామని విప్రో సీహెచ్ఆర్ఓ సౌరవ్ గోవిత్ తెలిపారు. 2024-25 తొలి త్రైమాసికంలో నికర లాభాల్లో 4.6 శాతం వృద్ధితో రూ.3,003.2 కోట్ల నికర లాభం సాధించినట్లు విప్రో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి దిశగా అడుగులేస్తున్నట్లు వివరించింది. విప్రో ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో గురువారంతో పోలిస్తే సంస్థ షేర్ 2.78 శాతం పతనంతో బీఎస్ఈలో రూ.557.25 వద్ద ముగిసింది. ఈ నేపథ్యంలో క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ నియామకాల ద్వారా కొత్త ఉద్యోగులను నియమించుకుంటామని విప్రో వెల్లడించింది. జూన్ నెలాఖరు నాటికి కంపెనీలో 2,34,391 మంది ఉద్యోగులు పని చేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుత త్రైమాసికంలోనే మూడు వేల నియామకాలు చేపడతామని వివరించింది. గ్లోబల్ బేస్డ్ డిమాండ్ కు అనుగుణంగా నిపుణులను నియమించుకుంటామని సౌరవ్ గోవిల్ తెలిపారు. విప్రోతోపాటు ఐటీ మేజర్లుగా ఉన్న ఇన్ఫోసిస్, టీసీఎస్ 20 వేల నుంచి 40 వేల మంది ఉద్యోగులను నియమించుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Post a Comment

0 Comments

Close Menu