గుజరాత్ లోని గాంధీనగర్‌లో ఐఏఎస్ అధికారి రణ్‌జీత్‌కుమార్ భార్య తనకు పరిచయమైన గ్యాంగ్‌స్టర్‌తో కలిసి నేరాలకు పాల్పడింది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఇంటికి వచ్చింది. దీంతో ఆమె భర్త విడాకులకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకొని ఇంటికి తిరిగొచ్చిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రణ్‌జీత్‌కుమార్ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో సెక్రటరీగా పని చేస్తున్నారు. ఆయన భార్య సూర్య జైకి కొంతకాలం క్రితం తమిళనాడుకు చెందిన ఓ గ్యాంగ్‌స్టర్ తో పరిచయం ఏర్పడింది. తొమ్మిది నెలల క్రితం ఆ గ్యాంగ్‌స్టర్‌తో కలిసి ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. వీరిద్దరూ కలిసి జులై 11న తమిళనాడులోని ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. మదురై పోలీసులు తక్షణమే స్పందించి బాలుడిని కాపాడారు. అప్పటినుంచి గ్యాంగ్‌స్టర్, సూర్య జై కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే గత శనివారం ఆమె గాంధీనగర్‌లోని తన భర్త రణ్‌జీత్‌కుమార్ ఇంటికి వచ్చింది. కానీ ఐఏఎస్ అధికారి ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో విషం తాగిన సూర్య జై 108కు ఫోన్ చేసింది. ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
ఐఏఎస్ అధికారి భార్య ఆత్మహత్య !
الثلاثاء، 23 يوليو 2024
Criem gujarat national అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఇంటికి వచ్చింది ఐఏఎస్ అధికారి భార్య ఆత్మహత్య ఐఏఎస్ అధికారి రణ్‌జీత్‌కుమార్ గ్యాంగ్‌స్టర్‌తో కలిసి నేరాలకు పాల్పడింది
ليست هناك تعليقات:
إرسال تعليق