రాజ్‌ తరుణ్‌ తనతో పదేళ్లకుపైగా సహ జీవనం చేశాడని, కానీ ఇప్పుడు వదిలేసి, హీరోయిన్‌ మాల్వి మల్హోత్రాని వివాహం చేసుకోబోతున్నాడని ఆరోపిస్తూ లావణ్య అనే యువతి కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ అంశం మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఇక ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇప్పటికే రాజ్‌ తరుణ్‌కు ఈ విషయమై నోటీసులు కూడా ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ అంశ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోన్నా రాజ్‌ తరుణ్‌ కానీ, మాల్వీ కానీ ఒక్కసారి కూడా అధికారికంగా స్పందించింది లేదు. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి తొలిసారి ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్రా కలిసి నటించిన 'తిరగబడరా సామి' మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వీరిద్దరు హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను పంచుకున్నారు. లావణ్య వివాదం గురించి మాట్లాడుతూ ఆరోపణలు చేసేవాళ్ళు బయట అలాగే మాట్లాడతారన్నాడు. తాను లీగల్ గానే ప్రొసీడ్ అవుతానని, ఆల్రెడీ ప్రొసీడ్ అవుతున్నానని చెప్పుకొచ్చాడు. ఇక తాను వేరే వాళ్లకు డ్యామేజీ చేయకూడదనే వేరే వాళ్ళ పేర్లు బయట పెట్టలేదన్నాడు. తనకు పోలీసులు నోటీసులు ఇచ్చారని, తన తరపున లాయర్ హాజరయ్యారని రాజ్‌ తరుణ్‌ తెలిపాడు. ఇక మాల్వీ మల్హోత్ర గురించి కూడా రాజ్‌ తరుణ్‌ మాట్లాడాడు. మాల్వీ గొప్ప నటి అని తెలుగులో ఆమెకు ఇదే తొలి చిత్రమన్నాడు. ఈ వివాదాలు పక్కనపెట్టేసి ఆమెను ఆశీర్వదిస్తారని అనుకుంటున్నా అని రాజ్‌ తరుణ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ