తెలంగాణలోని పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ మండలం పటేల్‌గూడ గ్రామానికి చెందిన సందీప్‌రెడ్డి ఆదివారం రాత్రి ముత్తంగి దాబాలో భోజనం చేసేందుకు కారులో కుటుంబ సభ్యులతో బయల్దేరారు. సుల్తాన్‌పూర్ వద్ద ఓఆర్‌ఆర్ ఎక్కిన కాసేపటికి వారి కుమారుడు మోక్షిత్‌రెడ్డి (6) మూత్రం వస్తోందని చెప్పడంతో కారు పక్కకు ఆపారు. అనంతరం బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా గుర్తు తెలియని వాహనం టైరు వేగంగా దొర్లుకుంటూ వచ్చి అతన్ని తగిలింది. తీవ్ర గాయాలు కావడంతో తల్లిదండ్రులు హుటాహుటిన ముత్తంగిలో ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి నగరంలో మరో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందాడని అమీన్‌పూర్ ఎస్సై సోమేశ్వరి తెలిపారు. ఓఆర్‌ఆర్‌పై ఏదైనా వాహనం టైరు ఊడిపోయి వేగంగా దొర్లుకుంటూ వచ్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా టైరు తగిలి మృతి !
الجمعة، 26 يوليو 2024
Criem telangana ఓఆర్‌ఆర్‌పై ఏదైనా వాహనం టైరు ఊడిపోయి వేగంగా దొర్లుకుంటూ వచ్చి ఉంటుందని బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా టైరు తగిలి మృతి
ليست هناك تعليقات:
إرسال تعليق