బంగ్లాదేశ్ హింసలో బాధితులుగా మారిన వారు పశ్చిమ బెంగాల్ వస్తే ఆశ్రయం కల్పిస్తామని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వారికి భరోసా ఇచ్చారు. బాధితులు తమ తలుపు కొడితే వారికి ఆశ్రయం కల్పించేందుకు తాము సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే బంగ్లాదేశ్ వేరే దేశమని చెప్పారు. ఆ దేశం గురించి తానేమి మాట్లాడ లేనన్నారు. దీనిపై భారత ప్రభుత్వం మాట్లాడుతోందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. అయితే పొరుగు దేశం నుంచి వచ్చే శరణార్థులను గౌరవించాలని గతంలో ఐక్య రాజ్య సమితి చేసిన తీర్మానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హింసాత్మకంగా మారిన బంగ్లాదేశ్‌లోని బంధువులు వద్ద చిక్కుకున్న బెంగాల్ నివాసితులకు తాను అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా మమత హామీ ఇచ్చారు. ఈ ర్యాలీలో సమాజావాదీ పార్టీ అధినేత, ఎంపీ అఖిలేష్ యాదవ్ సైతం పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ఆయన మోడీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
బంగ్లా బాధితులకు మమతా బెనర్జీ భరోసా !
الأحد، 21 يوليو 2024
national west bengal ఆ దేశం గురించి తానేమి మాట్లాడ లేనన్నారు దీనిపై భారత ప్రభుత్వం మాట్లాడుతోందని బంగ్లా బాధితులకు మమతా బెనర్జీ భరోసా
ليست هناك تعليقات:
إرسال تعليق