తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో అవినీతి నివేదిక శాఖ అధికారులకు మత్స్యశాఖ అధికారి రూ.25 వేలు లంచం తీసుకుంటూ సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి (డిఎఫ్ఓ) రూపేందర్ సింగ్ శుక్రవారం బాధితుల వద్ద నుండి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడని ఏసీబీ నల్లగొండ డిఎస్పి జగదీష్ చందర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆయన ఇంట్లో పట్టణానికి చెందిన సొసైటీ సభ్యుల నుండి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రూపేందర్ సింగ్ పై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కాగా ఈ అధికారి ఏసీబీకి పట్టుబడటం ఇది రెండోసారి కావడం గమనార్హం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల చెరువులలో చేపలు పట్టుకొనుటకు సొసైటీ కి అనుమతి ఇవ్వాల్సిందిగా సొసైటీ సభ్యులు జిల్లా మత్స్యశాఖ అధికారికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఫిషింగ్ కి అనుమతి ఇవ్వకుండా రూపేందర్ సింగ్ గత కొన్ని రోజులుగా సొసైటీ సభ్యులను తిప్పుతున్నాడు. రూ.25,000 లంచం ఇస్తేనే ఫిషింగ్ ఆర్డర్ ని ఇస్తానంటూ చెప్పటంతో సొసైటీ సభ్యులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు ఉదయం రూ.25 వేలు రూపాయలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని రిమాండ్ కి తరలించారు. అయితే 2016లో రూపేందర్ సింగ్ నిజాంబాద్ జిల్లాలో పనిచేసిన సమయంలో రూ.5000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కేసు కూడా ఉన్నది. గత రెండు సంవత్సరాలుగా సూర్యపేట జిల్లాలో పనిచేస్తున్న ఇతనిపై పలు అవినీతి ఆరోపణలు మెండుగా ఉన్నాయని అధికారి తెలిపారు.
0 Comments