Ad Code

అన్ లిమిటెడ్ 5జీ డేటా కోసం ఎయిర్ టెల్ కొత్త డేటా బూస్టర్లు !


యిర్ టెల్ కొత్త 5జీ డేటా బూస్టర్లను ప్రారంభించింది. ఇప్పటి వరకూ కేవలం 2జీబీ కన్నా ఎక్కువ రోజువారీ డేటాను ప్లాన్లకు మాత్రమే పరిమితం చేసిన 5జీ డేటా యాక్సెస్ ను ఇప్పుడు అంతకన్నా తక్కువ డేటా ప్లాన్లు వినియోగదారులకు అందించేందుకు ఈ కొత్త డేటా బూస్టర్లను తీసుకొచ్చింది. ఈ కొత్త డేటా బూస్టర్ల సాయంతో 1జీబీ, 1.5జీబీ రోజు వారీ డేటా ప్లాన్లు ఉన్న కస్టమర్లు కూడా వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ కొత్త డేటా బూస్టర్ల ప్యాక్లు రూ. 51, రూ. 101, రూ. 151కి అందుబాటులో ఉన్నాయి. ఈ పాక్ లు 3జీబీ, 6జీబీ, 9జీబీ డేటాను అందిస్తాయి. ఇవి కేవలం డేటా బూస్టర్లు మాత్రమే అన్న విషయాన్ని గుర్తించాలి. దీని వ్యాలిడిటీ ఇప్పటికే వినియోగిస్తున్న 5జీ బేస్ ప్లాన్ ఆధారంగానే ఉంటుంది. వినియోగదారులు నిరంతరాయంగా ఇంటర్నెట్ ను వినియోగించేందుకు వీలుగా ఈ డేటా బూస్టర్ ప్యాక్ లను తీసుకొచ్చినట్లు ఎయిర్ టెల్ ప్రకటించింది.

Post a Comment

0 Comments

Close Menu