ఊపిరితిత్తులు - ఆహార నియమాలు !


పిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం ముఖ్యం పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దుంపలు, టమోటాలు, బీన్స్, అవిసె గింజలు లాంటివి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే ఊపిరి తిత్తుల ఆరోగ్యం కోసం యాపిల్స్ తినవచ్చు. యాపిల్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, బీటా కెరోటిన్, విటమిన్లు సి, ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఊపిరితిత్తుల పనితీరు క్షీణతను మందగించి COPD ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇంకా నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని ప్రోత్సహిస్తుంది. అలాగే బ్రోకలీ, బ్రస్సెల్స్ మొలకలు వంటి కూరగాయలను  ఆహారంలో చేర్చుకోవడం వల్ల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బచ్చలికూర వంటి ఆకు కూరలను ఆహారంలో భాగం చేసుకొని ఎక్కువగా తినాలి. ఆహారంలో పసుపును తీసుకుంటే దాని ఇమ్యునోస్టిమ్యులెంట్, లక్షణాలు శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. క్యాటెచిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న గ్రీన్ టీ రోజూ తాగితే ఊపిరితిత్తుల పనితీరు, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఊపిరితిత్తుల పనితీరుకు తోడ్పడే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బ్లూబెర్రీస్, క్రాన్ బెర్రీస్ వంటి బెర్రీలను తీసుకోవడం మంచిది.శరీర వాపును తగ్గించడానికి, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడానికి సాల్మన్ ఫిష్, వాల్‌నట్‌లు వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాలను తినాలి. 

Post a Comment

0 Comments