అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ల పెళ్లి వేడుక శుక్రవారం అంగరంగా వైభవంగా జరిగింది.ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఈ వేడుకకు దేశ, విదేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలను ఆహ్వానించారు. టాలీవుడ్ నుంచి విక్టరీ వెంకటేశ్ తో పాటు రామ్ చరణ్- ఉపాసన దంపతులు, అఖిల్ అక్కినేని, సూపర్ స్టార్ మహేశ్ బాబు దంపతులు హాజరై సందడి చేశారు. భార్య నమ్రత, కుమార్తె సితారలతో కలిసి ఈ వేడుకకు హాజరయిన మహేశ్ బాబు బ్లాక్‍కలర్ ట్రెడిషనల్ ఔట్‍ఫిట్‍లో ఎంట్రీ ఇచ్చారు. షార్ట్ బియర్డ్ లాంగ్ హెయిర్ తో చాలా రోజులకు మరింత హ్యాండ్‍సమ్‍గా, కొత్తగా కనిపించాడు. దీంతో సోషల్ మీడియా అంతటా అనంత్ పెళ్లికంటే మహేశ్ లుక్ పైనే ఎక్కువ చర్చ జరిగింది. చాలామంది అభిమానులు రియల్ యానిమల్ మహేశ్ బాబు అంటూ కామెంట్లతో నింపేశారు. కొందరూ అయితే అసలు నిజాం కింగ్ మహేశ్ బాబే అంటూ పోస్టులు పెట్టారు. రాజమౌళి సినిమా కోసం మేకోవర్ అవుతున్న లుక్ లోనే ఈ వేడుకకు హాజరవడంతో ఫ్యాన్స్, నెటిజన్లు ఆయన ఫొటోలను, వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు.
అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ల పెళ్లి వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా మహేశ్ బాబు !
السبت، 13 يوليو 2024
Andhra Pradesh telangana అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ల పెళ్లి వేడుక కుమార్తె సితారలతో కలిసి భార్య నమ్రత స్పెషల్ అట్రాక్షన్‌గా మహేశ్ బాబు
ليست هناك تعليقات:
إرسال تعليق