తెలంగాణలోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం ఇచ్చారు. తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను పార్టీ మారుతున్నానని వెల్లడించారు. ప్రకాశ్ గౌడ్ తో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఉన్నారు.
కాంగ్రెస్లో చేరిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ !
الجمعة، 12 يوليو 2024
telangana కాంగ్రెస్లో చేరిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను పార్టీ మారుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
ليست هناك تعليقات:
إرسال تعليق