తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, ఎట్టిపరిస్థితుల్లోనూ వాయిదా వేసే ప్రసక్తి లేదని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇటీవల సబ్జెక్టులు, పోస్టుల వారీగా పరీక్షల తేదీలతో కూడిన పూర్తిస్థాయి షెడ్యూల్‌ను వెల్లడించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. ఇవే తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ పేర్కొంది. అయితే ఇటీవలే టెట్ ఫలితాలు విడుదలయ్యాయని, టెట్‌కు, డీఎస్సీకి భిన్నమైన సిలబస్ ఉండటంతో చదవడానికి సమయం సరిపోవడం లేదని పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వారంతా సోమవారం ఉదయం లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడించి, నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మొత్తం 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోస్టులకు 2.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. జులై 17 నుంచి మొత్తం 13 రోజులపాటు పరీక్షలు జరగనున్నాయి.
తెలంగాణలో డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ యథాతథం !
الثلاثاء، 9 يوليو 2024
telangana ఎట్టిపరిస్థితుల్లోనూ వాయిదా వేసే ప్రసక్తి లేదని పాఠశాల విద్యాశాఖ స్పష్టం జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు తెలంగాణలో డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ యథాతథం
ليست هناك تعليقات:
إرسال تعليق