మహారాష్ట్రలోని ఓ ప్రాంతానికి చెందిన స్వప్నికల్ ధావాడే (38) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన చాలా కాలం ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వహించారు. కొంతకాలం క్రితం రిటైర్ అయ్యారు. స్వప్నిల్ ధావాడే కి వీడియోలు చేయడం, యాత్రలకు వెళ్లడం అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే ఇటీవల తన 30 మంది స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ కి వెళ్లారు. తమిని ఘాట్ ప్రాంతంలో ఉన్న జలపాతం వద్దకు వీరందరు వెళ్లారు. ఈ క్రమంలోనే అక్కడ చాలా సేపు ఎంజాయ్ చేశారు. ఇదే సమయంలో వాటర్ ఫాల్ పై నుంచి తాను దూకుతానని, అది వీడియో తీయాలని తన స్నేహితులకు చెప్పాడు. ఈ క్రమంలో అక్కడ వీడియో తీయమని చెప్పి స్వప్నిల్ ధావాడే వాటర్ ఫాల్స్‌లో దూకాడు. అయితే అతడికి ఈత వచ్చినప్పటికీ జలపాతం వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటడంతో కొట్టుకుపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ వాటర్ పాల్స్ కు చేరుకుని ధావాడే కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వాళ్లు ఎంత శ్రమించిన అతడి జాడ మాత్రం తెలియరాలేదు. చివరు రెండు రోజుల తర్వాత జలపాతంకి కింద ఉన్న సరస్సులో ధావాడే మృతదేహం లభించింది. దీంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎక్కడో ఒక చోట బతికే ఉంటాడని భావించిగా..చివరకి విగతజీవిగా కనిపించాడు. ప్రస్తుతం అతడు జలపాతంలోకి దూకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ホーム
/
స్వప్నికల్ ధావాడే
/
వీడియో పిచ్చితో జలపాతంలోకి దూకిన గల్లంతైన మాజీ జవాన్ !
الاثنين، 1 يوليو 2024
maharashtra national ఈత వచ్చినప్పటికీ జలపాతం వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటడంతో వీడియో పిచ్చితో జలపాతంలోకి దూకిన గల్లంతైన మాజీ జవాన్ స్వప్నికల్ ధావాడే
ليست هناك تعليقات:
إرسال تعليق