తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ విజృంభిస్తున్నది. ఏడు నెలల్లోనే కేసుల సంఖ్య వెయ్యి దాటింది. డెంగ్యూని నియంత్రించాలంటే దోమల నివారణ చర్యలతోపాటు ట్రాకింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ కోసం దవాఖానల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్యంపైగానీ, దోమల నివారణపైగానీ, వైద్యారోగ్యశాఖ దవాఖానల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 'దోమల నివారణకు చర్యలు తీసుకోండి' అంటూ హడావుడి సమీక్షలు, ఆదేశాలు, ప్రకటనలే తప్ప క్షేత్రస్థాయిలో చర్యలు శూన్యమని ఆరోపణలు ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో డెంగ్యూ కేసులు పెరుగుతాయని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థే ఇటీవల హెచ్చరిక జారీ చేసింది. డెంగ్యూలోని నాలుగు ప్రధాన వేరియంట్లు డీఈఎన్వీ-1, డీఈఎన్వీ-2, డీఈఎన్వీ-3, డీఈఎన్వీ-4 రాష్ట్రంలో కనిపిస్తున్నాయని పేర్కొన్నది. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించినా తగిన చర్యలు తీసుకోకపోవడంతో డెంగ్యూ కేసులు భారీగా నమోదవుతున్నాయి.
0 Comments