శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు ఏడు రేడియల్‌ క్రస్ట్‌ గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తిద్వారా కూడా నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువనున్న జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 4.02 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఔట్‌ ఫ్లో 2.05లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా మంగళవారం సాయంత్రం ఆరింటికి 883.5 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా 207.04 టీఎంసీలుగా ఉంది.

Post a Comment

أحدث أقدم