పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. 2-0 గోల్స్ తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. దీంతో పూల్-బిలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. పెనాల్టీ కార్నర్, పెనాల్టీ స్ట్రోక్‌లను గోల్స్‌గా మలచి.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ జట్టుకు కీలక విజయాన్ని అందించాడు. తొలి మ్యాచ్‌లో భారత్.. న్యూజిలాండ్‌ను 2-1తో ఓడించిన సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్‌ను అర్జెంటీనాతో 1-1తో డ్రాగా ముగించింది. తదుపరి మ్యాచులు బెల్జియం, ఆస్ట్రేలియాతో ఆడనుంది.
إرسال تعليق