నెట్ ఫ్లిక్స్ తగ్గుతున్న యూజర్ బేస్ ను నిలిపేందుకు ఇటీవల కొత్త ప్లాన్లను ప్రకటించింది. యాడ్స్ తో వచ్చే కొత్త సరసమైన ప్లాన్ లను అందించింది. UK లో ఈ కొత్త ప్లాన్ లను అందించింది. ఈ ప్లాన్ సక్సెస్ అవ్వడంతో, UK మరియు US తో పాటు కెనడా లో బేసిక్ ప్లాన్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ ప్లాన్ స్థానంలో రెండు కొత్త ప్లాన్లను ఎంచుకునేలా ఆప్షన్ లను ఆఫర్ చేస్తోంది. ఈ బేసిక్ ప్లాన్ స్థానంలో యాడ్ సపోర్ట్ ప్లాన్, యాడ్ ఫ్రీ ప్లాన్ రెండు ఆప్షన్లు యూజర్లకు లిస్ట్ చేసింది. నెట్ ఫ్లిక్స్ ఊహించినట్లుగానే అక్కడ చవక ధరలో యాడ్ లతో తెచ్చిన సరసమైన ప్లాన్ వర్క్ అవుట్ అయ్యింది. ఈ ప్లాన్ దెబ్బకి యూజర్ బేస్ అమాంతం పెరిగినట్లు కూడా రిపోర్ట్స్ చెబుతున్నాయి. అందుకే, నెట్ ఫ్లిక్స్ ఆఫర్ చేస్తున్న బేసిక్ ప్లాన్ నిలిపివేసి యాడ్స్ తో కూడిన సరసమైన ప్లాన్ లేదా స్టాండర్డ్ ప్లాన్ ను ఎంచుకోవాలని నెట్ ఫ్లిక్స్ నోటిఫికేషన్ లను అందిస్తోంది. ఈ నోటిఫికేషన్ లతో కూడిన స్క్రీన్ షాట్ లను ఒక యూజర్ reddit లో పోస్ట్ చేశారు. దీని ప్రకారం, ఇప్పటి వరకూ $9.99 లకు ఆఫర్ చేస్తున్న బేసిక్ ప్లాన్ ను నిలిపేసింది. దీనికి బదులుగా యాడ్స్ తో కూడిన $5.99 లేదా FHD స్టాండర్డ్ ప్లాన్ $16.49 లేదా 4K ప్రీమియం ప్లాన్ $20.99 లను ఎంచుకోవాలని సూచిస్తోంది.
యాడ్స్ తో సరసమైన ప్లాన్లను ప్రకటించిన నెట్ ఫ్లిక్స్ ?
الأربعاء، 3 يوليو 2024
science technology UK UK లో ఈ ప్లాన్ సక్సెస్ అవ్వడంతో US తో పాటు కెనడా లో బేసిక్ ప్లాన్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది యాడ్స్ తో సరసమైన ప్లాన్లను ప్రకటించిన నెట్ ఫ్లిక్స్ ?
ليست هناك تعليقات:
إرسال تعليق