బ్రిటిష్‌ వలస పాలన నాటి నేర న్యాయవ్యవస్థను ప్రక్షాళన చేస్తూ రూపొందించిన మూడు నేర చట్టాలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం చేసిన వ్యాఖ్యలపై ఉప రాష్ట్రపత్రి జగదీప్‌ ధన్‌ఖడ్‌  మండిపడ్డారు. పార్లమెంట్‌ విజ్ఞతను అవమానించేలా ఆయన మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్ట్ టైమర్లు ఈ మూడు కొత్త చట్టాలను రూపొందించారని.. ఇటీవల ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పి. చిదంబరం వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ధన్‌ఖడ్‌ ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ''ఈ రోజు ఉదయం దినపత్రికలో వచ్చిన ఓ వ్యాసం చూసి నా హృదయం ఎంతో బరువెక్కింది. కొత్త నేర చట్టాలను పార్ట్‌ టైమర్లు రూపొందించారని కాంగ్రెస్‌ నేత వ్యాఖ్యానించారు. ఆయన గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఎంతో ప్రతిభావంతుడిగా పేరుతెచ్చుకున్న ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది'' అని ధన్‌ఖడ్ అసహనం వ్యక్తం చేశారు. '' పార్లమెంట్‌ సభ్యులను అవమానించేలా, వారి పరువుకి నష్టం కలిగించేలా మాట్లాడకండి. దయచేసి ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. నా అభ్యర్థనను కాంగ్రెస్‌ నేత పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నా'' అని అన్నారు. తిరువనంతపురంలోని స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధన్‌ఖడ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. వలసవాద తత్వం నుంచి బయటపడేసిన ఈ నూతన చట్టాలను పార్లమెంట్ ఆమోదించినందుకు గర్విస్తున్నానని పేర్కొన్నారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ