నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేశారని సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్‌లో శనివారం నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. తొమ్మిదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహించారు. సమావేశం అనంతరం వివరాలను నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం మీడియాకు వెల్లడించారు. ''వచ్చే 25 ఏళ్లలో వికసిత్ భారత్ సాధించే దిశగా ప్రధాని మోడీ కీలక సూచనలు చేశారు. మమతా బెనర్జీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదనటం వాస్తవం కాదు. ప్రతి సీఎంకు మాట్లాడేందుకు 7 నిమిషాల సమయం ఇచ్చాం. ప్రధానంగా రెండు అంశాలపై చర్చ జరిగింది. 2047 నాటికి వికసిత్ భారత్ సాకారం అయ్యే ప్రణాళికపై చర్చించాం. దేశంలో ప్రతి ఇంటికీ తాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాల కల్పనపై చర్చించాం. వికసిత్ భారత్‌పై కేంద్రం రూపొందించిన డాక్యుమెంట్‌ను వివరించాం. వికసిత్ భారత్ సాధించడంలో రాష్ట్రాల సహకారం చాలా ముఖ్యం. రాష్ట్రాలు అమలు చేయాల్సిన ప్రణాళికలపై సూచనలు చేశాం. వైద్యరంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై విస్తృతంగా చర్చించాం. సైబర్ సెక్యూరిటీలో అమలు చేయాల్సిన సాంకేతిక పరిజ్ఞానంపై చర్చించాం. అభివృద్ధి విషయంలో రాష్ట్రాల ప్రణాళికలు కూడా నీతి ఆయోగ్ శ్రద్ధగా విన్నది. కొన్ని రాష్ట్రాల సూచనలు, వారి ప్రణాళికలు చాలా బాగున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళ సహా పది రాష్ట్రాల నుంచి నీతి ఆయోగ్ సమావేశానికి ఎవరూ పాల్గొనలేదు'' అని సీఈవో వివరించారు. పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులతో పాటు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్, సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులుగా సమావేశంలో పాల్గొన్నారు.
వికసిత్ భారత్ సాధనకు రాష్ట్రాల సహకారం చాలా ముఖ్యం !
السبت، 27 يوليو 2024
national మోడీ రాష్ట్రాలకు పలు కీలక సూచనలు రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్‌లో వికసిత్ భారత్ సాధనకు రాష్ట్రాల సహకారం చాలా ముఖ్యం సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం
ليست هناك تعليقات:
إرسال تعليق