తన ఆరోగ్యం నిలకడగా ఉందని నటుడు ఆర్.నారాయణమూర్తి తెలిపారు. ఆయన అస్వస్థతకు గురయ్యారనే వార్తలతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ నారాయణమూర్తి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని, దేవుడి దయతో కోలుకుంటున్నట్లు పూర్తిగా కోలుకున్న తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. కాగా, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తికు తీవ్ర అస్వస్థత నెలకొంది. దీంతో నటుడు నారాయణమూర్తిని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతుండంతో ఫాన్స్‌ను ఉద్దేశించి ఆర్.నారాయణమూర్తి ప్రకటన చేశారు.
నేను ఆరోగ్యంగానే ఉన్నా !
الأربعاء، 17 يوليو 2024
cinema నటుడు ఆర్.నారాయణమూర్తి నేను ఆరోగ్యంగానే ఉన్నా ఫాన్స్‌ను ఉద్దేశించి ప్రకటన
ليست هناك تعليقات:
إرسال تعليق